కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార ఆర్థిక భరోసా అందిస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.14,28,822 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 359 దరఖాస్తులు పంపించగా,అందులో 267 మందికి సహాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.మరో 92 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శిరంగు శ్రీనివాస్, వల్లూరి రాజా,నల్లే ప్రసన్న,ముద్రగడ రమేష్,నందిపాటి అనంతలక్ష్మి,కరెడ్ల గోవింద్,తాటికాయల వీరబాబు,బండారు మురళి,మాదారపు తాతాజీ, దాసరి శివ,పుల్ల వీరబాబు,గరికిన సురేష్,రుద్ర పద్మావతి,జీని శ్రీనివాస్, మాదల రమణ,ప్రసాద్,బుజ్జి,ర్యాలీ సతీష్,రవి కిరణ్ పాల్గొన్నారు.








