పట్టణంలోని స్థానిక రామా థియేటర్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా నాయకులు పప్పులు, వీరబాబు,ఒమ్మి గోవిందు, చిన్న విశ్వనాథంలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి సంక్షేమ బోర్డు లో నిధులు కార్మికులకే ఖర్చు చేస్తాం అని హామీ ఇచ్చారన్నారు.కానీ నేటికీ బోర్డు పునరుద్ధరణ చెయ్యలేదన్నారు.నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేయాలని ఫిబ్రవరి 12న జరగబోయే దేశ వ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులంతా పాల్గొవాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సూరిబాబు,సత్తిబాబు,సాయి,చిన్న,ఏసు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.









