Search
Close this search box.

  మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ రైట్స్ కోసం ‘జీ’ సంస్థ భారీ డీల్..?

June 19, 2026 10:53 PM | Aditya369 News

మహేష్ – రాజమౌళి ‘వారణాసి’ రైట్స్ కోసం ‘జీ’ సంస్థ భారీ డీల్..?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమా అధికారికంగా ప్రారంభమైనప్పటి నుంచే దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ మీడియా సంస్థ ‘జీ నెట్‌వర్క్’ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ లేదా డిజిటల్ హక్కులే కాదు.. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్నింటినీ ఒకే డీల్‌లో దక్కించుకోవాలనే లక్ష్యంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

సాధారణంగా భారీ చిత్రాల హక్కులు వేర్వేరు సంస్థలకు విక్రయించడం చూస్తుంటాం. అయితే ‘వారణాసి’పై ఉన్న క్రేజ్, రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని జీ సంస్థ ఆల్-ఇన్-వన్ డీల్‌కు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ డీల్ గనుక ఫైనల్ అయితే, భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బిజినెస్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పలువురు అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలు కూడా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలే. ఈ భారీ డీల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి జీ నెట్‌వర్క్ ఈ చారిత్రాత్మక డీల్‌ను సొంతం చేసుకుంటుందా? లేక మరో ఓటీటీ దిగ్గజం రేసులో విజయం సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా  మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు