ఆటోలో ప్రయాణికుల పట్ల మర్యాదతో ప్రవర్తించాలని, శాంతి భద్రతలపై అవగాహన పెంచుకోవాలని పిఠాపురం సిఐ జి.శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు సూచించారు. విజిబుల్ పోలిసింగ్ కార్యక్రమంలో భాగంగా సిఐ పిఠాపురం చర్చిసెంటర్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్, భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పట్ల పోలీసులకు సహకరించాలని సూచించారు.









