Search
Close this search box.

  పిఠాపురంలో న్యాయ‌వాదులు నిర‌స‌న‌

పిఠాపురంలో న్యాయ‌వాదులు నిర‌స‌న‌
December 31, 2024 10:19 PM | Aditya369 News

పిఠాపురంలో న్యాయ‌వాదులు నిర‌స‌న‌

న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం చేసి అమలు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ వాదులు విధులు బహిష్కరించి స్థానిక కోర్టు బయట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలురు న్యాయవాదులు మాట్లాడుతూ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, న్యాయవాది, జల్లా సుదర్శన్ రెడ్డి పై, అనంతపురం జిల్లా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, కొండారెడ్డి దురుసు ప్రవర్తనకు అలాగే అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తమ పరిధిని దాటి సివిల్ వివాదం లో జోక్యం చేసుకుని, న్యాయవాది, వి.వి.శేషాద్రి వివరణను పట్టించు కోకుండా దురుసుగా ప్రవర్తించిన కారణంగా సదరు న్యాయవాది వత్తిడికి లోనై గుండెపోటుకు గురై చనిపోవటం జరిగిందన్నారు.

న్యాయవాది మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు . పోలీసులు చట్టం నిర్దేశించిన పద్దతిలో కాకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఎం అలీ, ట్రెజరర్ గౌతు రాజా, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు, సీనియర్ న్యాయవాదులు బత్తిన లక్ష్మణ్ దొర, కే.వీ .వి. వర్మ, అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డి, కాలి విజయకుమార్, ఎం, సత్యవతి , అల్లాడి గీత, కొంగు నూకరాజు, ముమ్మిడి రామకృష్ణ, వేలంగి వెంకటేష్, మహేష్, పి. రవికుమార్, సిహెచ్ మనో తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు