తిరుపతిలో దాతల ద్వారా సిఫార్సు చేసే గదులను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది .అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దాతలు గదులు కోసం పంపించే సిఫార్సులకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. అక్టోబర్ 4 ద్వజారోహణం, 12 చక్రస్నానం జరిగే రోజులు మినహా మిగిలిన అన్ని రోజుల్లో దాతలను దర్శనానికి అనుమతిస్తారు









