కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్.డి.డి.బి) ఇచ్చిన రిపోర్టును మా అందరికీ చంద్రబాబు చదివి వినిపించారు. ఒక రిపోర్టులో విజిటెబుల్ ఆయిల్స్ ఉండటం చూస్తే, ఏ స్థాయిలో కల్తీకి పాల్పడ్డారని చెబుతూనే అసలు నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, పంది కొవ్వు లాంటివి ఉన్నాయని రిపోర్టులో ప్రస్తావించారని పవన్ స్పష్టం చేశారు.









