క్యాన్సర్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలని ఉప్పాడ- కొత్తపల్లి ఎస్సై వెంకటేష్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కొత్తపల్లి వివిఎస్ పాఠశాల విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ఎస్సై అభినందించారు. క్యాన్సర్ వ్యాధిని జయించే పద్ధతులను నాటక రూపంలో చెప్పిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఏఎస్సై సుబ్బిరెడ్డి, పాఠశాల కరెస్పాండంట్ అనిశెట్టి కృష్ణారెడ్డి , ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు









