గుంటూరు కు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యలను జగన్ పరామర్శించారు. అంబటి చంద్రబాబుపై చేసిన బూతు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటిపై టిడిపి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఇదే సమయంలో అంబటిని పోలీసులు అరెస్ట్ చేయడంతో, కోర్టు రిమాండ్ విధించింది. ఈనేపథ్యంలో కుటుంబసభ్యులు ధైర్యాన్ని కోల్పోవద్దని జగన్ అన్నారు. అంబటి రాంబాబుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ రాకతో గుంటూరులో వైసీపీ కార్యకర్తలు జగన్ కు అడుగడుగునా కార్యకర్తలు బ్రహ్మారథం పట్టారు.









