రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొరటాల శివ, ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చితో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది…తరువాత మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. దాదాపు ₹200 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి నుంచి కొరటాల శివ సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి…ఆచార్యతో ఎదురుదెబ్బ – దేవర విజయంతో తిరుగుబాటు..మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తీసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర సెన్సేషనల్ హిట్ అయి కొరటాల శివకు మరోసారి విజయాన్ని అందించింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం అది త్వరలో మొదలయ్యే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే “దేవర 2 క్యాన్సిల్” అనే రూమర్స్ వేగంగా ప్రచారం అవుతున్నాయి..ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూట్ పూర్తి చేసిన తర్వాత దేవర 2లో నటిస్తారని వార్తలు వచ్చినా… ఇప్పుడు కొత్త టాక్ హాట్ టాపిక్‌గా మారింది. కొరటాల శివ, నాగచైతన్యకు ఓ కథ వినిపించగా అది ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. దీంతో నాగచైతన్యతో సినిమా త్వరలో పట్టాలెక్కబోతుందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో దేవర 2 రద్దయిపోయిందని కొందరు ఫేక్ న్యూస్ పాకిస్తున్నారు. కానీ ఎంతటి పరిస్థితుల్లోనైనా దేవర సీక్వెల్ మాత్రం తప్పక వస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.