తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా టాక్ ప్రకారం, ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఆమె ప్రధాన నాయిక కాదని, కీలక పాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్‌లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇక ఈ చిత్రానికి విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన నాయికగా మమితా బైజు నటిస్తుండగా, సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు..