Search
Close this search box.

  ఓజీ నుండి క్రేజీ అప్డేట్..!

‘హరి హర వీరమల్లు’ ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయినప్పటికీ, రెండేళ్ల తర్వాత పవన్‌ను చూడడం మాత్రమే ఫ్యాన్స్‌కు ఓ సంతృప్తి ఇచ్చింది. కానీ కంటెంట్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో, ఇప్పుడు అభిమానుల అన్ని ఆశలు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’పై ఉన్నాయి. డే 1 నుంచే భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమా, వాటికి తగ్గట్టుగానే రూపుదిద్దుకుంటోందని ఫీల్ కలుగుతోంది.

 

ఇటీవల విడుదలైన ‘ఓజీ’ ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పవన్‌ను ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చూడాలనుకున్న స్టైలిష్ అవతారంలో సుజిత్ చూపించారని, మొదటి పాటే స్పష్టతనిచ్చింది. ఈ లుక్‌తో అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు.

ఇక తాజాగా, ‘ఓజీ’ రెండో పాట గురించి సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఇది ఒక లవ్ సాంగ్ అని, లెజెండరీ సింగర్ చిత్ర గాత్రంలో రికార్డ్ అయినట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ ఈ పాటను విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు