Search
Close this search box.

  ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్..! డ్రాగన్ లో ఆ మలయాళ స్టార్ హీరోస్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం ‘ఎన్టీఆర్ – నీల్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టి షూటింగ్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళ స్టార్ టొవినో థామస్ నటించనున్నారన్న వార్తలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆ వార్తలకు మ‌రింత బలం చేకూర్చేలా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు.

ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ,

“ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఒక భారీ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ కథలో ఎన్నో ముఖ్య పాత్రలున్నాయి. వాటిలో టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు చేస్తున్నారు,” అని వెల్లడించారు.

ఈ కామెంట్స్‌తో టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఖచ్చితమైంది అని స్పష్టం అయింది. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి టాలెంటెడ్ నటులు భారీగా టాలీవుడ్‌కి వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

అయితే టొవినో ఈ సినిమాలో ఏ రకం పాత్ర పోషించనున్నారన్నది ఇంకా రివీల్ కాలేదు. హీరోనా? విలన్నా? లేక స్పెషల్ షేడ్ ఉన్న పాత్రలోనా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు