సూపర్‌స్టార్ రజనీకాంత్ – డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పేరొందిన స్టార్స్ నటిస్తున్నారు. నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఆధ్వర్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు..ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతి హాసన్ మీడియాతో మాట్లాడుతూ,
> “కూలీ ఒక పవర్‌ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో స్టైల్, యాక్షన్‌తో పాటు మంచి ఎమోషనల్ కోర్ కూడా ఉంది. లోకేశ్ డైరెక్ట్ చేసిన స్ట్రాంగ్ ఫీమెల్ క్యారెక్టర్‌ను నేను ప్రేమించాను. ముఖ్యంగా మహిళలు ఈ పాత్రతో కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది” అని అన్నారు.తాను రజనీకాంత్ కూతురిగా కాకుండా, సత్యరాజ్ కూతురిగా కనిపించనున్నారు అని వెల్లడించిన శ్రుతి,
> “రజినీ సర్, నాగార్జున గారు, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గారు వంటి సూపర్‌స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఇది ప్రతి నటుడికీ వచ్చే అవకాశం కాదు. అందుకే ఈ సినిమా నా కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుంది,” అన్నారు.
ఇక నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్‌గా కనిపించబోతుండటంపై శ్రుతి,
> “అయన పాత్ర ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. చాలా పవర్‌ఫుల్ రోల్. తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతారు,” అని తెలిపారు.
మ్యూజిక్ గురించి మాట్లాడుతూ,
> “అనిరుథ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు నేను మ్యూజిషియన్ పాత్ర చేయాలని ఆశ ఉంది,” అని చెప్పారు.