Search
Close this search box.

  త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ పౌరాణిక చిత్రం రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎస్. నాగవంశీ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..తాజాగా నాగవంశీ మాట్లాడుతూ,

“సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూసిన నేను, ఇప్పుడు తారక్‌ను దేవుడిగా చూపించబోతున్నాననే భావన నాకు గర్వంగా ఉంది” అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని వెల్లడించారు..అలాగే, వెంకటేశ్ – త్రివిక్రమ్ సినిమా వచ్చే ఆగస్ట్‌లో షూటింగ్ మొదలవుతుందని, తారక్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభించనున్నామని చెప్పారు.

 

విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా ఆయన స్పందించారు.

“విజయ్ ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ప్రజలు ఆయనను టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు” అని అన్నారు.ఇక మరోవైపు, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘వార్ 2’ సినిమాపై కూడా నాగవంశీ స్పందించారు..

“ఈ సినిమాలో తారక్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ అవుతుంది. తారక్ – హృతిక్ మధ్య ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. అదే చూసి నేనే తెలుగులో విడుదల చేయాలనుకున్నాను” అని చెప్పారు..తారక్ కేవలం కొన్ని నిమిషాలే కనిపిస్తారనే వార్తలు వదంతులేనని, హృతిక్, తారక్ ఇద్దరికీ సమాన స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందనీ క్లారిటీ ఇచ్చారు..

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు