Search
Close this search box.

  ఆ రోజే SSMB29 గ్లింప్స్ రిలీజ్..? పాన్ వరల్డ్ షేక్ అయ్యేలా మేకింగ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ssmb29.. ఈ సినిమా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. RRR సినిమాతో రాజమౌళి క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది.. RRR బ్లాక్ బస్టర్ గా నిలిచి.. ఆస్కార్ అవార్డు కూడా ర్ సినిమాకు రావడంతో రాజమౌళి క్రేజ్ పాన్ వరల్డ్ రేంజ్ లో పెరిగిపోయింది.. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమా ఇప్పటికే రెండు కీలకమైన షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నరూ.. ఈ సినిమా సంబంధించి ఇప్పటికి వరకు ఎలాంటి అప్డేట్ యూనిట్ నుండి రాలేదు.. ఐతే ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..భారీ బడ్జెట్‌తో, ప్రపంచ స్థాయి టెక్నికల్ టిమ్‌తో, అత్యున్నత ప్రమాణాల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఒకసారి గ్లింప్స్ వస్తే, అదే ప్రపంచ వ్యాప్తంగా షేక్ చేసేలా ఉంటుంది అనే నమ్మకం అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ఉంది..మహేష్ బాబు మ్యాజిక్‌కి రాజమౌళి బ్రాండ్‌ వాల్యూ కూడా కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇంటర్నేషనల్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా గ్లింప్స్‌ను ఆగస్ట్ 9న, అంటే మహేష్ బాబు బర్త్‌డే రోజున విడుదల చేయనున్నారని బజ్ వినిపిస్తోంది. ఇది నిజమైతే అభిమానులకి ఇది నిజమైన పండగే..! చూడాలి మరి మహేష్ బర్త్ డే కు గ్లింప్ వస్తుందో లేదో..! ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను kl నారాయణ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు