దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘లక్కీ భాస్కర్ ” ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది..ఓ బ్యాంక్ ఉద్యోగి ఓ పెద్ద స్కాం నుండి ఎలా బయట పడ్డాడు.. అనే కథతో ఈ సినిమా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది.. దాంతో ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది..ఈ సినిమా హిట్ అవ్వడంతో వెంకీ అట్లూరికి దర్శకుడిగా మంచి మార్కులు పడ్డాయి..ఐతే ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలోను సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది.. డైరెక్టర్ వెంకీ అట్లూరి రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో లక్కీ భాస్కర్ సినిమా సీక్వెల్ ఉండబోతుంది అని చెప్పాడు..ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
“లక్కీ భాస్కర్ ఒక ప్రత్యేకమైన కథ. దానికి సీక్వెల్ చేయాలంటే లోతైన పరిశీలన అవసరం,” అని ఆయన అన్నారు. షూటింగ్ దశలోనే సీక్వెల్ గురించి ఆలోచన వచ్చిందనీ, కానీ ప్రేక్షకుల స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు తెలిపారు.వెంకీ మాట్లాడుతూ – “ఇప్పటికే ప్రేక్షకుల నుండి సీక్వెల్ పై మంచి డిమాండ్ వస్తోంది. అందుకే దాన్ని ఖచ్చితంగా చేస్తాను.. అయితే, సరైన కథ సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది,” అన్నారు..ఇకపోతే, ‘లక్కీ భాస్కర్’ సక్సెస్ తర్వాత వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా మరో కొత్త సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే… ఈ సినిమా తరువాత లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది..









