Search
Close this search box.

  మరో క్రేజీ డైరెక్టర్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్..? ఈసారి మరో క్రేజీ ప్రాజెక్ట్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అసలు ప్లాన్ ప్రకారం ఈ సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ మొదలయ్యేలా ఉండేది. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం, అట్లీ సినిమా మొదలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..ఇక తాజాగా అల్లు అర్జున్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈసారి బన్నీ చేయబోయే సినిమా దర్శకుడు మరెవరో కాదు… మలయాళ ఇండస్ట్రీలో హీరోగానూ, దర్శకుడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్..సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోందేమంటే — “మిన్నల్ మురళి” వంటి క్రియేటివ్ సూపర్ హీరో సినిమాతో పేరు తెచ్చుకున్న బాసిల్, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఇది అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది…ఇదిలా ఉండగా, బన్నీ ప్రస్తుతంగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సన్ పిక్చర్స్ ప్రొడక్షన్‌లో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు…ఈ రెండు ప్రాజెక్టులూ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.. ఒకవైపు భారీ విజువల్ వండర్ – మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ బాసిల్‌తో కొత్త ప్రయోగం..ఈ న్యూస్ తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు