రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘స్పిరిట్ సినిమా ఇప్పుడే తెరపైకి రాకముందే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపిక చుట్టూ జరిగిన పరిణామాలు చిత్రానికి ఊహించని ప్రచారాన్ని తెచ్చాయి..సందీప్ వంగా తొలుత బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణెను ‘స్పిరిట్’ చిత్రానికి హీరోయిన్గా తీసుకోవాలని భావించారు. కథ వినగానే ఆమె ఆసక్తి చూపినా, రెమ్యునరేషన్ డిమాండ్లు, షూటింగ్ షెడ్యూల్‌పై ప్రత్యేకమైన షరతులు దర్శకుడికి ఇబ్బందిగా మారాయి. దీంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది…ఇటీవల దీపిక ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ:
> “ఒక దర్శకుడు మంచి కథ చెప్పారు. నాకెంతో నచ్చింది. కానీ నా రెమ్యునరేషన్ విషయంలో నేను చెప్పిన మొత్తం వారికి నచ్చలేదు. నేను నా మార్కెట్ విలువను బాగా తెలుసు, అందుకే నో చెప్పాను,” అని వివరించింది..దీపిక ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన తర్వాత, ఆమె పీఆర్ టీం ‘స్పిరిట్’ స్టోరీని మీడియాకు లీక్ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ (ఇప్పటి X) వేదికగా తీవ్రంగా స్పందిస్తూ –
“డర్టీ పీఆర్ గేమ్స్” అంటూ ఘాటుగా మండిపడ్డారు..
దీంతో నెట్టింట్లో దీపిక పేరు మరోసారి ట్రెండ్ అయ్యింది. అభిమానులు, సినీ వర్గాల్లో ఈ వివాదంపై పెద్ద చర్చే నడుస్తోంది.