Search
Close this search box.

  గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో..? ఏకంగా మణిరత్నం డైరెక్షన్లో..?

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు… నవీన్ పోలిశెట్టి సినిమాలు మెల్లిగా చేసిన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.. కథ బాగుంటానే సినిమా చేయడానికి ముందుకు వస్తాడు.. అలా తనదైన స్టైల్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు నవీన్.. కొంచెం టైం లోనే మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. నవీన్ పోలిశెట్టి చివరి సినిమా మిస్ శెట్టి, మిసెస్ పోలిశెట్టి రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది.. కానీ ఇప్పటి వరకు మరో సినిమా గురించీ ఏ ప్రకటన రాలేదు.. కొద్ది రోజుల క్రితం ఆగిపోయిన అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్ మళ్ళీ రీస్టార్ చేశారు.. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం.. ఐతే నవీన్ పోలిశెట్టి తన నెక్స్ట్ సినిమాను ఓ బిగ్ తమిళ డైరెక్టర్ తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ప్రముఖ దర్శకుడు మణిరత్నం, తన తదుపరి సినిమాకి నవీన్ పోలిశెట్టిని హీరోగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్‌కి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైపోయినట్టు తెలుస్తోంది..ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిను తీసుకునే ఆలోచనలో మణిరత్నం ఉన్నారని సమాచారం. నటన పరంగా నవీన్, సాయిపల్లవిలు ఇద్దరూ చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మర్స్.

ప్రస్తుతం మణిరత్నం ‘థగ్ లైఫ్’ అనే భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్‌తో పని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాతే నవీన్ పోలిశెట్టి సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని టాక్. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు