పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. వరుసగా షూటింగ్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.. కానీ ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడో ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది.. ఇప్పుడు కూడా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..హైదరాబాద్కు చెందిన అమ్మాయితో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి… ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని, త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంద్ చరణ్ గణపవరంకు చెందిన అమ్మాయితో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిపిన మాటలు నెటిజన్లను ఆసక్తిగా తీర్చాయిి…
ఇటీవల, బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి ఓ న్యూస్ ఉందని చెప్పడంతో అప్పటి నుండి ప్రభాస్ పెళ్లి పై వార్తలు జోరు అందుకున్నాయి ..అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ పై ప్రభాస్ టీమ్ ఈ వార్తలపై స్పందిస్తూ, పెళ్లి గురించి వస్తున్న సమాచారం సరిగ్గా లేదని స్పష్టం చేసింది.
ప్రభాస్ టీమ్ తెలిపిన ప్రకారం, ఎటువంటి అధికారిక ప్రకటన వస్తే, అది వారు స్వయంగా వెల్లడిస్తారని తెలిపారు. 45 ఏళ్ల ప్రభాస్ ప్రస్తుతం బ్యాచిలర్‌గా ఉన్నారు. ప్రస్తుతం, ఆయన ‘ది రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. 2025 చివర్లో ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కావచ్చు.









