Search
Close this search box.

  ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై

కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా పని చేస్తున్న ఎల్. గుణశేఖర్ ఏసీబీ వలకు చిక్కారు.ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుకు సంబంధించి విచారణ ముగిసినప్పటికీ, ఆ కేసు నుండి బాధితులను పూర్తిగా తప్పించాలంటే రూ 20 వేలు లంచం అడిగినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. పిఠాపురం మండలం పి. దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు లపై నాలుగు నెలల క్రితం పిఠాపురం రూరల్ స్టేషన్లో ఎస్సీ , ఎస్టి అట్రాసిటీ కేసు నమోదయింది.

ఈ కేసులో కాకినాడ డి.ఎస్.పి విచారణ చేసి ఫాల్స్ కేసుగా నిర్ధారించారు. అయినప్పటికీ ఆ కేసు పూర్తిగా ముగించాలంటే పై అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ బాధితులను డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని రూ. 5 వేలు మాత్రమే ఇచ్చుకోగలమని ఎస్సై ను పలుమార్లు బ్రతిమిలాడారు. ఎంతకీ ఎస్ఐ ఒప్పుకోకపోవడంతో బాధితులు ఏసీబీ ని ఆశ్రయించారు.

రాజమండ్రి ఏసీబీ డిఎస్పి కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బాధితులు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సై ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై కి ప్రైవేటు డ్రైవర్ గా ఉన్న శివను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాము చాలా కాలం నుండి నలిగిపోయిన తర్వాత మాత్రమే ఏసీబీ ని ఆశ్రయించామని బాధితులు చెప్పుకొచ్చారు.

*పోలీసు వర్గాల్లో కలకలం*

పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ ఏసీబీకి పట్టుబట్టడంతో పోలీసు వర్గాల్లో కలగలం రేగింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం పట్ల ఒకసారి గా చర్చ రేగింది. పిఠాపురం పోలీసులు పనితీరు బాగోలేదని గతంలోనే పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు బదిలీలు ఉంటాయని బాగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ పోలీసులు బదిలీలను పోలీస్ అధికారులే పట్టించుకోకపోవడంతో వారి పనితీరుపైన ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ ఏసీబీకి పట్టుపడడంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు