సామర్లకోట పట్టణ ప్రజలకు త్రాగునీరందించే ఫిల్టర్ బెడ్ చెరువులో చేపల వేట నిర్వహించడం సరికాదనిజిల్లా మానవహక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అన్నారు.చేరువుని పరిశీలించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కుళాయి చెరువులో జలాలు ఇప్పటికే ఇంకిపోయి త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతుండగా దానిలో చేపల వేట చేపడుతుండగా ఉన్న జలాలు కలుషితమై ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందన్నారు.పైగా జిల్లా కలెక్టర్ అనుమతులున్నట్టు ఫిషర్మెన్ సొసైటీ చెబుతుందన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలన్నారు. త్రాగునీటి కలుషితం వలన ప్రజలు అనారోగ్యానికి గురైతే అధికారులే భాద్యత వహించాల్సి వస్తుందన్నారు.
