Search
Close this search box.

  దేశంలోనే తొలి e-FIR…ఎక్కడంటే..!

February 23, 2025 3:44 PM | Aditya369 News

దేశంలోనే తొలి e-FIR…ఎక్కడంటే..!

జమ్మూ కాశ్మీర్ లోని విల్గామ్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దేశంలో తొలి ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (e-FIR) నమోదు చేసింది. ఇంతియాజ్ అహ్మద్ దార్ అనే వ్యక్తి దాడికి గురైనట్లు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది డిజిటల్ పోలీసింగ్ లో కీలక మలుపు.

డిజిటల్ పోలీసింగ్‌లో భాగంగా హంద్వారాలోని విల్గామ్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు తన మొదటి ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దార్ తరత్‌పోరా నుండి శ్రీనగర్‌కు ప్రయాణిస్తుండగా విల్గామ్ చేరుకున్న తర్వాత, విల్గామ్‌లోని షెహ్నిపోరా నివాసితులైన ఆషిక్ హుస్సేన్ భట్, గౌహెర్ అహ్మద్ భట్ అనే ఇద్దరు వ్యక్తులు తనను తప్పుగా నిర్బంధించి తనపై దాడి చేశారని ఇంతియాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని అతను పోలీసులకు వాట్సాప్‌ ద్వారా తెలియజేశాడు. వాట్సాప్‌ ద్వారా వచ్చిన సమాచారంతో విల్గామ్ పోలీసులు BNS (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 115(2),126(2) కింద ఈ-ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు