యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) ఈమధ్య కాలంలో తన సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలకి కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ చిత్రాల నుండి విడుదలయ్యే టీజర్ , ట్రైలర్లకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటిస్తూ.. ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయి, ఎన్టీఆర్ కి కాస్త స్వాంతన ఇచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో ‘వార్ -2’ సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో పోటీ పడడానికి విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఛావా’ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
ఛావా మూవీకి వాయిస్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్..
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా.. ఫిబ్రవరి 14వ తేదీన బాలీవుడ్లో విడుదలైన చిత్రం ఛావా(Chhaava). రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇందులో యేసు భాయి క్యారెక్టర్ లో.. శంభాజీ మహారాజ్ భార్యగా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman utkar) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా కథ మొదట మహేష్ బాబు (Maheshbabu) వద్దకు వెళ్లగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విక్కీ కౌశల్ (Vicky kaushal) వరకు చేరడంతో ఆయన శంభాజీ మహారాజ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఇటీవల ఈయన పాత్రకు సంబంధించిన మేకోవర్ వీడియో విడుదల చేయగా.. పాత్ర కోసం విక్కీ ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఈ పాత్ర కోసం దాదాపు 100 కిలోల బరువు పెరిగిన విక్కీ కౌశల్ , కత్తి సాము కూడా నేర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విక్కీ కౌశల్ పాత్రకి ఎన్టీఆర్ వాయిస్ అందించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లు తగలబడిపోతాయని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఎన్టీఆర్ సినిమాలు..
ప్రస్తుతం ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిన్న లాంచనంగా హైదరాబాదులో షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ లేకుండానే దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ ప్రారంభించారు ప్రశాంత్ నీల్. మార్చి నుండి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే అటు ప్రశాంత్ నీల్ మూవీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.