మనిషి ఎలా ఉన్నాడు అనేది వారి ఆకారాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరి శరీరం.. వారి ఇష్టం. నువ్వు నల్లగా ఉన్నావ్.. ? లావుగా ఉన్నావ్.. పొట్టిగా ఉన్నావ్.. ? ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలు అనేవారికి సరదాగా ఉన్నా.. పడేవారికి చాలా బాధను కలిగిస్తాయి. వారి ఆరోగ్యం, వారు జీవించే జీవితాలను బట్టి శరీరం కనపడుతుంది. ముఖ్యంగా ఈ బాడీ షేమింగ్ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ ఉంటుంది. సన్నగా నాజూకు నడుముతో ఉన్న హీరోయిన్.. కొద్దిగా లావు అయితే చాలు. ఆ హీరోయిన్ ఇక పనిరాదు.. బాగా ఒళ్లు చేసింది.. షేపులు కనిపించవు అని ముఖం మీదనే చెప్పుకొచ్చేస్తారు. ఇక హీరో లావు అయ్యాడు అంటే.. వీడసలు హీరోనా.. ? ఇలా మారిపోయాడేంటి.. ? అంటూ కామెంట్స్ చేస్తారు.
ఇక ఇప్పుడు ఆ బాడీ షేమింగ్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వచ్చాయి. ఒక పదవిలో ఉన్నారు అన్న గౌరవం లేదు.. ఒక హీరో అన్న మర్యాద కూడా లేకుండా పవన్ పై బాడీ షేమింగ్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు ట్రోలర్స్. ఈ మధ్యనే పవన్.. మహాకుంభా మేళాలో మెరిసిన విషయం తెల్సిందే. త్రివేణి సంగమంలో ఆయన బనియన్ కూడా విప్పి పవిత్ర స్నానం ఆచరించారు. ఇక అప్పుడు పవన్ పొట్ట బయటపడింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పొట్ట ఏంటి.. నువ్వసలు హీరోవేనా..అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ విషయంలో తప్పుఒప్పులను కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఎంతో ఫిట్ గా ఉండే పవన్.. ఇప్పుడు కాస్తా పొట్ట పెంచి కనిపించారు. సాధారణంగా.. ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయినా కూడా తన ఫిట్ నెస్ ను పెంచుకోవడానికే కస్టపడుతూ ఉంటాడు. అంతెందుకు 60 ఏళ్లు దాటినా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఫిట్ నెస్ విషయంలో రాజీ పడకుండా కష్టపడడంతోనే ఇప్పుడు ఇంకా కుర్ర హీరోలకు పోటీగా నిలబడగలుగుతున్నారు.
పవన్ విషయం వేరు. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో.. అప్పటినుంచి సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే జనసేన పార్టీకి ఫండ్స్ అవసరమై.. ఎవరిని అడగలేక.. సినిమాలు చేస్తూ అందులో వచ్చిన డబ్బుతో పార్టీని నడుపుతూ వచ్చారు. ఇక రాజకీయాలు, ప్రచారాలు అంటే మాములు విషయం కాదు. సినిమాలు చేస్తూ ఏసీలో తిరిగే పవన్.. అన్నింటిని వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రచారాల్లో మాములు చెప్పులతో నడిచారు. ఎన్నోసార్లు అనసరోగ్య సమస్యలతో కుప్పకూలారు.
ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి.. ఇలా ఎన్నో సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ఇక ప్రజల సమస్యలు. ఈ సమస్యలన్నీ వదిలేసి .. ఆయన శరీరం పై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా.. ? ఇలాంటివేమీ అర్ధం చేసుకోకుండా.. ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదు అని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులు కూడా మారారు. హీరోకు సిక్స్ ప్యాక్ ఉండాలి.. హీరోయిన్ సైజ్ జీరో నడుము ఉండాలి.. ఇలాంటివేమీ వారు పట్టించుకోవడం లేదు. కథ ఉండాలి. ఆ కథ కన్విన్స్ గా ఉండాలి. ఇదే చూస్తున్నారు. ఇక పవన్ విషయానికొస్తే.. ఆయకు పొట్ట ఉందా.. ? బట్ట ఉందా.. ? అని చూడరు. ఆ కటౌట్ కనిపిస్తే చాలు. సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా రికార్డులు వచ్చేస్తాయి. కొంచెం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బావుంటుందని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకనైనా ఇలాంటి బాడీ షేమింగ్ చేయడం ఆపితే బావుంటుందని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇస్తున్నారు.