పెద్దాపురం మండల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధిం చి 3,821 మంది తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నారని తహశీల్ధార్ సిహెచ్ వెంకటలక్ష్మి తెలిపారు.వీరిలో పురుషులు 2,407 మంది,మహిళలు 1414 మంది ఉన్నారన్నారు.ఎన్నికల పోలింగ్ కు పట్టణ పరిధిలోని మహా రాణి కళాశాలలో 4,లూధరన్ హైస్కూల్లో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
