రాబోవు శివరాత్రి ఉత్సవాలలో ప్రోటోకాల్, వీఐపీ దర్శనాల పేరుతో ఎప్పుడంటే అప్పుడు దర్శనాలు కుదరవని, ఈవిషయంలో భక్తులను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా సమయాలను తెలుపుతూ ముందుగానే ప్రకటన చేస్తామన్నారు. మాకు నచ్చినట్టుగా వస్తామంటే కుదరదని, అలా చేస్తే కాళ్లు విరుగుతాయంటూ బాహటంగా కలెక్టర్ సీరియస్‌గా హెచ్చరించారు.
భక్తులకు ఇబ్బందులు కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. ఈనేప థ్యంలో ఈ ఏడాది ఎటువంటి పాస్‌లు ఉండవన్నారు. ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్నందున ఎటువంటి సిఫార్సులకు తావివ్వొద్దని కలెక్టర్ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం పాద గయ క్షేత్రంలోనూ, సామర్లకోట కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలోనూ శివరాత్రి ఉత్సవాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.