సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాలపాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. వికసిత్ భారత్ -2047కు అనుగుణంగా ఐసీటీఎక్స్ దేవాలయాల నిర్వహణ, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తోందన్నారు. గోవా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు డాక్టర్ ప్రమోద్ సావంత్, దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్, ప్రముఖులు హాజరయ్యారు. 17 దేశాలు, 1,581 దేవాలయాలను కలిపి ఐటీసీఎక్స్ దీనిని చేపట్టింది.
