తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట దగ్గర ఉన్న ఉపమాక వెంకన్నస్వామి ఆలయాన్ని ఒక్కసారి సందర్శించాలని టిటిటి ఛైర్మన్‌ను బి.ఆర్.నాయుడిని హోంమంత్రి అనిత కోరారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆమె బి.ఆర్.నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపమాక ఆలయాన్ని 2017లో టీటీడీకి అప్పగించినా.. ఇప్పటి వరకు అభివృద్ధికి నిధులు కేటాయించలేదని హోంమంత్రి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన బి.ఆర్.నాయుడు ఆలయం అభివృద్ధిపై నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
