పోలీసులు నక్సల్స్‌పై వరుస ఎన్ కౌంటర్లు చేయడంపై మావోలు ఒడిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్లను పోలీసులు అప్రమత్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జాతీయరహదారిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. చింతూరు ఏజెన్సీ చట్టి వద్ద వాహనాలను దారి మళ్ళీస్తున్నారు.ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని మన్యం వాసులను పోలీసులు కోరారు.
