అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కారానికి ఈ నెల17వ తేదీన ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని చేపెట్టాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అంగన్వాడి వర్కర్లకు సమావేశం లో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలం అవుతున్న నేటికీ సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు.అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం,అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
