Search
Close this search box.

  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

తూర్పు, పశ్చిమ గోదావరి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలియ జేశారు.ఏలూరు కలెక్టర్ రేట్ నుండి తూర్పు,పశ్చిమ గోదావరి శాసన మండలి పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర చేనేత,జౌళి శాఖ మఖ్య కార్యదర్శి కె.సునీత,నియోజక వర్గ పరిధిలోని 6 జిల్లాల కలెక్టర్లు,ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా జిల్లాలో ఈ ఎన్నిక నిర్వహణకు పోలింగ్ అధికారులు, సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ల నియామకం, వారికి శిక్షణ, ఎంసిసి అమలు పర్యవేక్షణ అధికారులు, స్క్వాడ్ల నియామకం,బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె కలెక్టర్లు, ఎస్పిలను అడిగి తెలుసుకున్నారు.కాకినాడ కలక్టరేట్ కోర్టు హాలు నుండి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పి జి.బిందు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పట్టభద్రుల ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లు, 21 మండల పరిధిలో 70,540 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 42,463 మంది పురుషులు, 28,072 మంది మహిళలు, 5 గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలియజేసారు. వీరి కొరకు 96 పోలింగ్ స్టేషన్లు, 2 ఆగ్జలరీ పోలింగ్ స్టేషన్లు వెరసి 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో 67 పోలింగ్ కేంద్రాలు కాకినాడ డివిజన్ లోను, 31 కేంద్రాలు పెద్దాపురం డివిజన్ లోను ఉన్నాయని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు 25 శాతం రిజర్వుతో కలిపి 123 మంది పిఓలు, 123 మంది ఏపిఓలు, 246 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని, 123 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలియజేసారుపోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు ఈ నెల 14,20 తేదిలలోను, ఓపిఓలకు ఈ నెల 21న, మైక్రో అబ్జర్వర్లకు 22వ తేదీన కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో శిక్షణ ఏర్పాటు చేసామన్నారు.ఈ నెల 26 కాకినాడ డివిజన్ కు మెక్లారిన్ హెస్కూల్ లోను, పెద్దాపురం డివిజన్ కు పెద్దాపురం ఆర్డిఓ కార్యాలయంలోను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 27వ తేదీన కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాలులో రిసెప్షన్ సెంటరు, ఇంటర్మీడియేట్ స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 98 పోలింగ్ కేంద్రాలను 21 జోన్లు, రూట్లుగా విభజించి 21 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు.ఎన్నిక నిర్వహణకు 20 శాతం రిజర్వుతో కలిపి 216 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని, 10 శాతం రిజర్వుతో కలిపి 78,100 బ్యాలెట్ పేపర్లు అవసరమని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణకు మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలతో 29 ఎంసిసి టీములు ఏర్పాటు చేసామని, జడ్ పి సిఈఓ ను నోడల్ అధికారిగా నియమించామని చెప్పారు.జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లోను, డివిజన్ స్థాయిలో ఆర్డిఓ కార్యాలయాలలోను ఎన్నికల కంట్రోలు రూమ్లు, డిఐపిఆర్ఓ నోడల్ అధికారిగా మీడియా సమాచార కేంద్రం ఏర్పాటు చేసామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి యంసిసి పటిష్ట అమలుకు సహకారం కోరామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు, పోలింగ్ టీములకు కనీస సదుపాయాలు ఉండేలా చర్యలు గైకొన్నామని కలెక్టర్ షాన్ మోహన్ ఎన్నికల పరిశీలకులకు తెలియజేశారు.

జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి.బిందు మాధవ్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు లేవని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, శివరాత్రి ఏర్పాట్లు ఒకేసారి చేపట్టవలసి ఉన్నందున సిబ్బంది కొరత లేకుండా ఏపిఎస్పి బలగాల సహకారాన్ని తీసుకునేందుకు అనుమతి కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి మనీష్ పాటిల్ దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి, ఏఆర్ఓ జె.వెంకట్రావు, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం.జగన్నాధం పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు