Search
Close this search box.

  వైసీపీ కౌన్సిల‌ర్ ఇంట్లో రేష‌న్ బియ్యం

రేష‌న్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న‌పోలీసులు

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని గొల్ల‌ప్రోలు న‌గ‌ర పంచాయ‌తీలో వైసీపీ కౌన్సిల‌ర్ ఇంట్లో రేష‌న్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. పిఠాపురం సిఐ శ్రీనివాస్‌, గొల్ల‌ప్రోలు ఎస్సై రామ‌కృష్ణ‌లు క‌లిసి రెవిన్యూ అధికారులు, సిబ్బందితో దాడులు నిర్వ‌హించారు. 35 సంచుల్లో రేష‌న్ బియ్యం ఉన్న‌ట్లు వ‌చ్చిన స‌మాచారంతో పోలీసులు, పౌర‌స‌ర‌ఫ‌రాలశాఖ అధికారులు సంయుక్తంగా త‌నిఖీలు చేశారు.

వైసీపీ ప్ర‌స్తుతం కౌన్సిల‌ర్ గా ఉన్న మొగ‌లి దుర్గానంద‌రావు నివాసంలో అక్ర‌మంగా నిల్వ ఉంచి 17.49 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని గుర్తించి, సీజ్ చేశారు. గొల్ల‌ప్రోలుకు చెందిన సిరిపిరెడ్డి వీర‌భ‌ద్ర‌రావు అనే వ్య‌క్తి స్థానికుల నుండి రేష‌న్ బియ్యాన్ని కొనుగోలు చేసి, దుర్గానంద‌రావు నివాసంలో వీటిని నిల్వ ఉంచారు.

పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ భారతి చేసిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ‌కృష్ణ తెలిపారు.స్వాధీనం పరుచుకున్న బియ్యం విలువ రూ. 80,500 గా ఉంటుందన్నారు. స్వాధీన పరుచుకున్న బియ్యాన్ని పిఠాపురంలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు