మూడో వన్డేలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.ఈ మేరకు భారత క్రికెటర్లతో కూడిన వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది.’అవయవ దానం చేయండి ప్రాణాలు కాపాడండి’ అనే థీమ్ తో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ నెల 12న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
