Search
Close this search box.

  ఇండిగోపై శృతిహాసన్ ఫైర్..! ఎందుకంటే..?

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నటి శృతిహాసన్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కార‌ణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంట‌ల పాటు ఆల‌స్యం కావ‌డ‌మే. దాంతో ఇండిగోపై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని చెప్పిన ఆమె… కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమాన‌యాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

 

తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంట‌ల పాటు ఉండిపోయామని శృతిహాస‌న్ తెలిపారు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది విమానం ఆలస్యం విష‌య‌మై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిప‌డ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమాన‌యాన‌ సంస్థ తన స‌ర్వీసుల‌ను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు.

 

ఇక శృతిహాసన్‌ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శృతిహాసన్‌ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది.

 

అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమ‌ర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంట‌ని దుయ్య‌బ‌ట్టారు. ఉన్న విష‌యం చెబితే ప్ర‌యాణికులు ప్ర‌శాంతంగా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు