Search
Close this search box.

  చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు, ఆ కేసులో ట్విస్ట్..

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసులో నిందితుడుగా ఉన్న సీఐడీ మాజీ ఎస్పీ విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పిటిషనర్ విజయ్ పాల్ పై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

తనను కస్టడీలోకి తీసుకున్న అప్పటి సీఐడీ పోలీసులు అధికారులు చిత్ర హింసలకు గురి చేశారని, ఆ పోలీసు అధికారుల్లో సీఐడీ మాజీ పోలీసు అధికారి ఆర్ విజయ్ పాల్ కూడా ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో విజయ్ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

 

అయితే విజయ్ పాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు గత నెల 24వ తేదీన ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో విజయ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్ పాల్ తరుఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత దురుద్దేశంతోనే విజయ్ పాల్ పైన కేసులు నమోదు చేశారని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

 

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఇంకా వాదనలు వినిపించడానికి ప్రయత్నించగా తాము ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఇంకా ఎక్కువ వాదనలు అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నాలుగు వారాల్లో పూర్తి సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు కేసు విచారణ వాయిదా వేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీ ఎంపీ అయిన రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

ఆ తర్వాత అప్పటి సీఐడీ అధికారులు తనను కొన్ని రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, ఆ సందర్భంలో తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ తో పాటు అప్పటి సీఐడీకి చెందిన కొంతమంది పోలీసు అధికారులపైన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇదే కేసులో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే విజయ్ పాల్ ను తొందపడి అరెస్ట్ చేయకూడదని సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు