Search
Close this search box.

  అధికారులకు షాక్.. అడ్డుకున్న మూసీ ప్రాంతవాసులు..

హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనపై అధికారులు రంగంలోకి దిగేశారు. పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 టీమ్‌లతో సర్వే చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లో 16 , రంగారెడ్డిలో నాలుగు, మేడ్చల్ జిల్లా పరిధిలో ఐదు బృందాలు సర్వే చేస్తున్నాయి.

 

నదీ గర్బంలోని నిర్వాసితుల నిర్మాణాల గురించి వివరాలను సేకరిస్తున్నారు. తొలిసారి సర్వే చేసిన అధికారులు మరోసారి రీ సర్వే చేస్తున్నారు. బాధితుల వివరాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దిల్‌సుఖ్ నగర్ ఏరియాలోని కొత్తపేట, మారుతి‌నగర్, సత్యానగర్‌లో అధికారులను అడుగు పెట్టనీయలేదు మూసీ నివాసితులు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లను ఖాళీ చేయమంటూ మూసి నివాసితుల కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం సర్వే మాత్రమేనని, అంతకుమించి మరేమీ లేదని అధికారులు ప్రజలకు విన్నవించినప్పటికీ ఏ మాత్రం అంగీకరించలేదు. పరిస్థితి గమనించిన అధికారులు సర్వే నిర్వహించకుండానే తిరిగి వెళ్ళిపోయారు.

 

మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను రాజకీయ పార్టీలు రెచ్చగొడతాయని కాంగ్రెస్ సర్కార్ ముందుగానే గుర్తించింది. నది అభివృద్ధిలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు మూవీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది.

 

బఫర్ జోన్‌లో ఉంటున్న 15 వేల కుటుంబాలకు రెండు గదుల ఇళ్లను కేటాయించాలని నిర్ణయించింది. బుధవారం అందుకోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ప్రజలు జీవిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపాలు చేసుకుంటూ ఉంటున్నారు.

 

నిర్మాణాలు తొలగించే ముందు వారిందరికీ పునరావాసం కల్పించిన తర్వాతే భూసేకరణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే నిర్మాణాలు కూల్చివేస్తామని చెబుతున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు