తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో కల్తీ చేశారన్న సంచలన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కు భారత ఆహార భద్రతా ప్రమాణాల విభాగం (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఏఆర్ ఫుడ్స్ తో పాటు, మరికొన్ని ఇతర సంస్థలకు గత శుక్రవారమే ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఆయా సంస్థలు ఇచ్చే సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకోనుంది.