కాకినాడ జిల్లా జగ్గంపేట హైవే కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద 4 లక్షలు విలువైన గంజాయిని కిర్లంపూడి ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ తో పాటు గంజాయిని సరఫరా చేస్తుండగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. 84 కేజీల గంజాయి 43 ప్యాకెట్ల రూపంలో వీటిని తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పెద్దాపురం డిఎస్పి లతాకుమారి వివరాలు వెల్లడించారు.
