ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లాకు వెళ్లనున్నారు.ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈనేపద్యంలో పవన్ కళ్యాణ్ కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజ కవర్గం, మైసూరా వారి పల్లి గ్రామసభలో పాల్గొంటారు. తొలి గ్రామ సభకు పవన్ కళ్యాణ్ కడప జిల్లాను ఎంపిక చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
