బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని వివరాలు సేకరించాలని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమంపై అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని వెల్లడించారు.
