రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి 12 గంటల సమయానికి కాకినాడ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రతిపాడు హైవే మీదుగా కాకినాడ చేరుకున్నారు. మధురపూడి విమానాశ్రయంలో అభిమానులు పవన్ కు ఘన స్వాగతం పలికారు.
