కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీ జాతీయ జెండాతో పిఠాపురం టిడిపి నేత వర్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన జిపిటి ఫ్రెండ్స్ హెల్పింగ్స్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. పిఠాపురం టిడిపి కార్యాలయం నుండి ఉప్పాడ బస్టాండు వరకు ప్రదర్శన ర్యాలీ జరిగింది. దేశ సమగ్రతను, భక్తిని చాటడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను వర్మ అభినందించారు.
