ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్న కేసీఆర్ కుమార్తె కవిత బెయిల్ పీటీషన్ పై సుప్రీం కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా ఈ కేసులో 493 మంది సాక్షులను సిబీఐ, ఈడీలు విచారించాయి.