పేదవాడి కడుపు నింపడమే అన్న క్యాంటీన్ లక్ష్యం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ అన్నగాటి సెంటర్ వద్ద అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నా యన్నారు. కేవలం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లలో పేదవాడికి భోజనం దొరుకుతుందన్నారు.
