Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ అందరిలాంటి వ్యక్తి కాదు..–:శ్రియా శరణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని ప్రముఖ సినీ నటి శ్రియా శరణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ… ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయం దక్కించుకున్నారన్నారు. ఆయన విషయంలో తాను గర్వపడుతున్నానన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన కలిగిన వ్యక్తని అన్నారు. అలాంటి జనసేనానిని ప్రజలు ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారని తాను నమ్ముతున్నానన్నారు.

ఇద్దరం కలిసి గతంలో ‘బాలు’ సినిమాకు పని చేశామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా సైలెంట్ వ్యక్తి అని, శ్రమపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైందని, పాట షూట్ పూర్తయ్యే వరకు ఆయన ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు.

తన గురించి మాట్లాడుతూ… ప్రస్తుతం తాను షో టైమ్ అనే కార్యక్రమం కోసం పని చేస్తున్నానని తెలిపారు. బాలీవుడ్‌లో కూడా మంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు. అలాగే తేజ సజ్జా సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు భాషతో సంబంధం లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. తనకు భారత చిత్ర పరిశ్రమ అంటే ఇష్టమని తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు