Search
Close this search box.

  జీవితంలో ఆ పని అస్సలు చేయొద్దంది.. జాన్వీ సంచలన వ్యాఖ్యలు..

జీవితంలో ఆ విషయం మాత్రం అసలు చేయవద్దని తన తల్లి సలహా ఇచ్చిందని అది కూడా తాను గట్టిగా ఫాలో అవుతానని చెబుతోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉంది. ఒక పక్క బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటూనే ఏకంగా తెలుగులో రెండు బడా ప్రాజెక్టులు పట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన సినిమా తాజాగా హిందీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అదేంటంటే ఈ సినిమాలో పాత్ర కోసం జుట్టు కట్ చేసుకుని కనపడాలని డైరెక్ట్ అడిగానని అయితే అది ససేమిరా చేయలేనని చెప్పానని చెప్పుకొచ్చింది.

 

ఒకవేళ ఆ పాత్ర నా జీవితాన్ని మార్చేసేది లైఫ్ టైం ఆపర్చునిటీ అని నేను భావించిన జుట్టు కట్ చేసుకోవడానికి లేదా గుండు చేయించుకోవడానికి అసలు ఏమాత్రం ఇష్టపడను. విఎఫ్ఎక్స్ వాడుతారు కదా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలా చేయడానికి కారణం తన తల్లి చెప్పిన సలహానే అని ఆమె పేర్కొంది. తన మొదటి సినిమా దడక్ చేస్తున్న సమయంలో జుట్టు కట్ చేసుకోవాల్సి వచ్చిందని అప్పుడు తన తల్లి చాలా కోప్పడి బాధ పడిందని చెప్పకొచ్చింది. నన్ను ఇదంతా ఎలా చేశావు? ఇంకెప్పుడు ఏ పాత్ర కోసం జుట్టు కట్ చేసుకోకు అని సలహా ఇచ్చిందని ఆమె పేర్కొంది. అలాగే ధడక్ సినిమా షూటింగ్ జరుగుతున్న నాలుగైదు రోజులకి తన తలకు ఆయిల్ పెట్టించి మసాజ్ చేయించేదని నా జుట్టు చూసే మురిసిపోయేదని చెప్పుకొచ్చింది. కాబట్టే నేను హెయిర్ కట్ చేయించుకోనని క్లియర్ గా చెప్పేస్తానని ఆమె పేర్కొంది. తన తల్లి తనకు చెప్పిన స్ట్రిక్ట్ అడ్వైజ్ కావడంతో దాన్ని కచ్చితంగా ఫాలో అవుతానని ఆమె పేర్కొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు