జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, దాదాపు 60 మంది గాయపడినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేశారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ హౌరా నుంచి ముంబైకి వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.
రెండు రోజుల కిందట ఇదే రూట్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అదే రూట్లో హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ఘటనతో సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టాటానగర్-చక్రధర్‌పూర్ సెక్షన్ మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదం కారణంగా చాలా రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని ప్రత్యా మ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
ప్రమాదానికి గురైన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 11 గంటలకు చక్రధర్‌పూర్ రావాల్సివుంది. టాటానగర్‌కు అర్థరాత్రి రెండున్నర గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి నెమ్మదిగా చక్రధర్‌పూర్‌కు వెళ్తోంది. ఈలోగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు.. గూడ్స్‌ని ఢీకొట్టింది. వెంటనే 18 బోగీలు పట్టాలు తప్పాయని బాధితులు చెబుతున్నమాట. ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టింది.