Search
Close this search box.

  పారిస్ వీధుల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి..!

July 27, 2024 9:10 PM | Aditya369 News

పారిస్ వీధుల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి..!

పారిస్‌లో ఒలింపిక్స్ వేడుకలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు చూసేందుకు సినీ తారలు, ప్రముఖులు, సందర్శకులు తరలివెళ్లారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో సందడి చేశారు. కొన్ని రోజుల క్రితం మెగా కుటుంబమంతా విహార యాత్రలకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన మనవరాలు క్లింకారాతో లండన్ వీధుల్లో సందడి చేశారు. అక్కడినుంచి నేరుగా పారిస్ వెళ్లారు.

ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో మెగాస్టార్ పాల్గొన్నారు. ఈ మేరకు తన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు ఆనందంగా ఉందన్నారు. సురేఖతో కలిసి ఒలింపిక్స్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందరూ పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు